![]() |
![]() |

అమెరికా అమ్మాయి సీరియల్ తో సామ్గా బుల్లితెర తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ మెరీనా. తెలుగమ్మాయి పాత్రలో మెప్పించిన మెరీనా.. బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపుతో ముందుకు దూసుకెళ్లింది. ఐతే ప్రస్తుతానికి మాత్రం బుల్లితెరకు బ్రేక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. 2014 నుంచి మెరీనా బుల్లితెర మీద వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది..అలాంటి మెరీనా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చేప్పింది. తను ప్రెగ్నెంట్ ఐన విషయాన్ని చెప్పింది. అలాగే ఆ ప్రెగ్నెన్సీ కిట్ ని తన భర్త రోహిత్ కి ఇచ్చి జాగ్రత్తగా లైఫ్ లాంగ్ దాచమని చెప్పింది.
అలాగే తాను ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి హిడెన్ కెమెరా పెట్టి రోహిత్ ఎమోషనల్ ఐన మెమోరీస్ ని షూట్ చేసింది. తర్వాత ఆ వీడియో చూపించి సర్ప్రైజ్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 షోలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఐతే ఈ మధ్య కొన్ని ఫోటో షూట్స్ చేసింది మెరీనా. అందులో కొంచెం బొద్దుగా కనిపించేసరికి నెటిజన్స్ అంతా అడిగారు "మీరు ప్రెగ్నెంట్ ఆ" అని. దానికి ఒక వీడియో చేసి "ఎస్. మేము ప్రెగ్నెంట్" అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు ఇద్దరూ . 2021 లో నేను ప్రెగ్నెంట్ అయ్యా కానీ మొదటి స్కానింగ్ లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. హార్ట్ బీట్ వస్తుందేమో అని మూడు నెలల పాటు ఎదురుచూసినా రాలేదు. దాంతో లోపల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్స్ స్టమక్ క్లీన్ చేసుకున్నాను. 2022లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు కూడా అదే సమస్య ఎదురయ్యింది. ఆ టైములో స్టెరాయిడ్స్ బాగా ఇచ్చారు. దాంతో బాగా లావు అయిపోయాను. ఇక ఇప్పుడు మల్లి ప్రెగ్నెంట్ అంటూ చెప్పింది మరీనా.
![]() |
![]() |